telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో ఎన్నికల కసరత్తు.. మొదలెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం..

chandrababu at kondapalli utsav

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో ఒకేసారి జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహణకు అవసరమైన కసరత్తు చేపట్టింది.

ఈనెల 11, 12వ తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటించనుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల నమోదు, ఈవీఎంల వంటి అంశాలపై చర్చించేందుకు ఈనెల 11వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అదే రోజు కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సమావేశం కానుంది. 12వ తేదీన మద్య నియంత్రణ, డబ్బుపంపిణీకి అడ్డుకట్ట వేయడం, శాంతిభద్రతల అంశాలపై ఆయా విభాగాధిపతులతోపాటు ఇతర ముఖ్యమైన విభాగాలతోనూ సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

Related posts