telugu navyamedia
news political Technology trending

ఇక యూట్యూబ్ కు .. సెన్సార్ .. కేంద్రనిర్ణయం..

youtube logo

ఒకప్పుడు కేవలం థియేటర్స్, టీవీలకు మాత్రమే పరిమితమైన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు యూట్యూబ్ తరహా అనేక మాధ్యమాలలో మన చేతుల్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ అంటూ బోలెడన్ని డిజిటల్ స్ట్రీమింగ్ సైట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కొత్త కొత్త కథాంశాలతో డేరింగ్ టేకింగ్ తో ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుంటున్నాయి. ఇలా రూపొందుతున్న వెబ్ సిరీస్ లలో ఎక్కువగా బూతు కంటెంట్ లేదా అడల్ట్ డైలాగులు ఉంటున్నాయి. వీటికే ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. ఎంత ఎక్కువ బూతు మాటలుంటే అంత బోల్డ్ గా తీసినట్లు లెక్క వేస్తున్నారు. ఎలాగు సెన్సార్ లేకపోవడంతో ఇక కంట్రోల్ అన్నది ఈ వెబ్ సిరీస్ లకు లేదు. ఎలాంటి కంటెంట్ ను అయినా ప్రేక్షకులకు చూపించవచ్చు. అందుకే అశ్లీల సీన్లు తీసేవారు ఎక్కువైపోయారు. వీటి వల్ల లాభాలు కూడా బాగుండడంతో ప్రొడక్షన్ హౌజ్ లు చాలా మటుకు ఇలాంటి వెబ్ సిరీస్ లు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

ఈ వెబ్ సిరీస్ లు నటీమణులకు మంచి ఆదాయ మార్గాలుగా మారాయి. సినిమాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో వెబ్ సిరీస్ లలో పారితోషికాలు ఉంటుండడంతో వీరు కూడా బోల్డ్ గా నటించడానికి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చెయ్యట్లేదు. హిందీ వాళ్ళు ఈ విషయంలో చాలా ముందున్నా, తెలుగులో కూడా ఈ మధ్యే మొదలైంది. ఇప్పటికే నలుగురు టాలీవుడ్ దర్శకులు కలిసి లస్ట్ స్టోరీస్ ను తెలుగులో తీస్తున్న విషయం తెల్సిందే. అశ్లీలం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వెబ్ సిరీస్ పై కూడా సెన్సార్ కట్స్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. సో త్వరలో వెబ్ సిరీస్ లో అశ్లీలం ఉండబోదు.

Related posts

ఓట్ల లెక్కింపుకు .. పటిష్ట ఏర్పాట్లు చేయండి.. అధికారులను ఆదేశించిన : సీఎస్

vimala p

విక్రమ్ లాండింగ్ పై ప్రధాని .. ప్రతి అపజయం .. గొప్ప విజయానికి ఆరంభం ..

vimala p

బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్‌ సంస్థ.. రూ.20 కోట్లు కుచ్చుటోపీ!

vimala p