telugu navyamedia
తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

కేసిఆర్ బయోపిక్ : “ఉద్యమ సింహం”కు సెన్సార్ బోర్డు షాక్

KCR Fire to Congress MLA Gandra
తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవితం ఆధారంగా “ఉద్యమ సింహం” అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అల్లూరి కృష్ణం రాజు దర్శకత్వం వహిస్తుండగా నటుడు నటరాజన్ కేసీఆర్ పాత్రలో నటించారు. కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 15 రోజుల క్రితం సినిమాను సెన్సార్ బోర్డుకు పంపగా… సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలుపుతూ సినిమాను వెనక్కి పంపిందట. అప్పట్లో సంచలనం రేపిన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల ఫొటోలు, కాంగ్రెస్ కండువా కనబడడం లాంటి సన్నివేశాలను ఎడిట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు సూచించిందట. 
ఇప్పుడు మరోసారి సినిమా ఎడిటింగ్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా కేసిఆర్ పాత్రధారి నటరాజన్ మాట్లాడుతూ ” సినిమా ఎడిటింగ్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డుకు సోమవారం పంపనున్నాం. ఫిబ్రవరి 8న సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కెసిఆర్ ప్రీమియర్ షోను చూస్తానని మాటిచ్చారు. సాధారణ ఎన్నికల్లోపు కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై సినిమా సీక్వెల్ తీసే ఆలోచన కూడా ఉంది” అని తెలిపారు. గతేడాది నవంబరులోనే సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా విడుదల వాయిదా వేసి, ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Related posts