telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

రాజకీయ పునరావాస కేంద్రంగా సెన్సార్ బోర్డు

Censor Board,political rehabilitation center
హైదరాబాద్ సెన్సార్ బోర్డు  రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి . కేంద్ర సమాచార శాఖ ఆధీనంలో వుండే సెన్సార్ బోర్డు ఇటీవలకాలంలో నియమించిన అభ్యర్థుల్లో 90 శాతం మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కావడం ఈ విమర్శకు ఆధారం . గతంలో పేరున్నా జర్నలిస్టులను, రచయితలను , సమాజంలో మేధావులైన వారిని సెన్సార్ సభ్యులుగా నియమించేవారు . 
ఆ సంప్రదాయానికి ఇప్పుడు పూర్తిగా  మంగళం పడేశారు .  ఎన్నికల నగారా మ్రోగిన సందర్భంగా కేంద్ర సంచార శాఖా  కార్యదర్శి పి .కె  ఝా  8 మంది కొత్త సెన్సార్ సభ్యులను నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . మర్చి 8 వ తేదీన ఈ ఉత్తర్వు వెలువడింది . 
మీగడ వీర సత్య, గణేష్ కోటిపల్లి, ఏ . సుధాకర్ యాదవ్, వి . స్వతంత్ర భారతి,  డాక్టర్ దామరాజు కామేశ్వర రావు ,అట్లూరి రామకృష్ణ , వై వి ఎల్ ఎన్  శాస్త్రి ని నియమించారు . గతంలో 60 మందికి పైగా సభ్యులను  నియమించారు.  శ్రీమతి జీవిత రాజశేఖర్ భారతీయ జనతా పార్టీలో చేరగానే ఆమెను హైదరాబాద్ సెన్సార్ కార్యాలయంలో చైర్ పర్సన్ గా నియమించారు . ఆమెకు సినిమా అంటే అవగాహన వుంది. నటి , దర్శకురాలు కూడా . కానీ ఆమె ఆ అర్హతతో చైర్ పర్సన్ కాలేదు . కేవలం బీజేపీ పార్టీలో చేరడం వల్లనే జీవితను గుర్తించారు . ఇది నిజంగా దౌర్భాగ్యమే కదా !
భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలను సంతృప్తి పరచడానికి ఈ విధంగా  సెన్సార్ లో సర్దుబాటు చేస్తున్నారు . నిజానికి ఇలా సభ్యులైన వారికి సినిమా పట్ల అవగాహన లేదు  , చదువు పెద్దగా  ఉండదు . ఇదేదో గొప్ప పదవి అనుకుంటారు . నిజానికి ఇది బాధ్యతాయుతమైన పదవి తప్ప లాభసాటిది కాదు . 
చాలా మందికి  సినిమా సెన్సార్ అయిపోయిన తరువాత ఫారం  పూర్తీ చేయడం రాదు . తెలుగులో సంతకం పెట్టి మిగతావి మీరు రాసుకోండి అని సెన్సార్ అధికారికి  ఇచ్చేస్తారు . ఎదో  ఉంటుందని వచ్చే సభ్యులు తీరా వచ్చాక ఈ పదవి చెప్పుకోవడాని , చూపించుకోవడాని ఐడీ కార్డు తప్ప మరేమీ ఉండవని అర్ధమవుతుంది . అయితే ఎందరో ఇలాగే అవగాహన లేకుండా , చదువు లేకుండా ఉంటారని కాదు , కానీ ఎక్కువ భాగం మాత్రం ఇలాంటి సభ్యులే ఉండటం మాత్రం నిజం . కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ , తమ కార్యకర్తల పునరావాస కేంద్రం గా సెన్సార్ బోర్డు ను భావించడం దురదృష్టకరమైన విషయం . 
రాజకీయ కక్ష్య  సాధించడానికి కూడా కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ పాల్పడుతుందని వాదన కూడా వుంది . అందుకు ఉదాహరణ . రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా  పద్మావతి హిందీ చిత్రాన్ని రిలీజ్ కాకుండా అడ్డుపటమే . ఆ సినిమా పేరు కూడా మార్చిందాకా వదిలిపెట్టలేదు . ఆరోగ్యకరమైన సినిమాలు రావాలని వేదికలపైన ఉపన్యాసాలు దంచే నాయకులు … మేధావులు వుండాల్చిన సెన్సార్ బోర్డులో కార్యకర్తలు నియమిస్తున్నారు . రాజకీయ ప్రయోజనం తప్ప వీరికి సమాజ శ్రేయస్సు అక్కరలేదు . 

Related posts