telugu navyamedia
telugu cinema news

మూకదాడులపై ప్రధానికి సినీ ప్రముఖుల లేఖ

Celebrities write open letter to PM over lynchings

ఈరోజు భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగానికి చెందిన ప్ర‌ముఖులు ప్ర‌ధాని మోదీకి ముస్లింలు, ద‌ళితులు, ఇత‌ర మైనార్టీల‌పై జ‌రుగుతున్న మూక‌దాడుల్ని త‌క్ష‌ణ‌మే అడ్డుకోవాల‌ని బ‌హిరంగ‌ లేఖ రాశారు. ఫిల్మ్ రంగానికి చెందిన 49 మంది ప్ర‌ముఖులు ఈ లేఖ‌ను రాశారు. మ‌ణిర‌త్నం, అనురాగ్ క‌శ్య‌ప్‌, శ్యామ్ బెన‌గ‌ల్‌, అప‌ర్ణాసేన్‌, శుభా ముగ్ద‌ల్‌, రామ‌చంద్ర‌న్ గుహ లాంటి హేమాహేమీలు ఉన్నారు. జూలై 23వ తేదీ ఉన్న లేఖ‌ను విడుద‌ల చేశారు. ప్ర‌తిఘ‌ట‌న లేకుండా… ప్ర‌జాస్వామ్యం ఉండ‌ద‌ని ఆ లేఖ‌లో ప్ర‌ముఖులు అభిప్రాయ‌ప‌డ్డారు. జై శ్రీరామ్ అన్న నినాదం ఓ యుద్ధ పిలుపుగా మారింద‌ని విమ‌ర్శించారు. మ‌న‌ది శాంతికాముక దేశ‌మ‌ని, భార‌తీయులుగా గ‌ర్విస్తున్నామ‌ని, కానీ దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని ఫిల్మ్ ప్ర‌ముఖులు ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో చెప్పారు. 2016లో 840 హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జ‌రిగినట్లు ఆ లేఖ‌లో తెలిపారు. ఎక్కువ సామాజిక వ‌ర్గానికి రాముడు ఓ ప‌విత్ర‌మైన వ్య‌క్తి అని, అలాంటి రాముడి పేరును ఎందుకు నాశ‌నం చేస్తున్నార‌ని లేఖ‌లో తెలిపారు. అయితే సినీ స్టార్స్ రాసిన లేఖ‌ను కేంద్ర హోంశాఖ ఖండించింది.

Related posts

శోభన్ బాబును, ఆయన భార్యను కన్నీళ్లు పెట్టించిన అభిమానులు

vimala p

అగ్ర నటులతో .. చేయాలనుంది .. : ఈషారెబ్బా

vimala p

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం

vimala p