telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విక్టరీ వెంకటేష్ కు వెల్లువలా పుట్టినరోజు శుభాకాంక్షలు

Venkatesh

యాక్ష‌న్, కామెడీ, రొమాన్స్ ఇలా పాత్ర ఏదైనా తనదైన శైలిలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్. క‌లిసుందాం రా, ప్రేమించుకుందాం రాం, నువ్వు నాకు న‌చ్చావ్‌, ప‌విత్ర బంధం, గ‌ణేష్‌, ల‌క్ష్మీ, తుల‌సి వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు. నేడు వెంక‌టేష్ 59వ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా అభిమానులు, సెల‌బ్రిటీలు, ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. వెంక‌టేష్‌కి టాలీవుడ్ సినీ లోకం జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌హేష్ బాబు, అనీల్ రావిపూడి, కోన వెంక‌ట్‌, అనీల్ సుంక‌ర‌, రాశీ ఖ‌న్నా, నితిన్, శ్రీను వైట్ల‌, బాబీ, రానా ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు వెంకీకి బ‌ర్త్‌డే విషెస్ అందించారు. రామానాయుడు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వెంక‌టేష్ అనతి కాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విక్టరీనే త‌న ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఎక్కువ‌గా ఆక‌ర్షించాడు. తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్‌ని మ‌రోసారి తీసుకొచ్చి అద్భుత‌మైన హిట్స్ సాధిస్తున్నారు వెంక‌టేష్‌. తొలిసారి మహేష్‌ బాబుతో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన వెంకీ తరువాత యంగ్‌ హీరో వరుణ్ తేజ్‌తో కలిసి ఎఫ్‌ 2 సినిమా చేశారు. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. ఇక తాజాగా త‌న రియల్‌ లైఫ్‌ అల్లుడు నాగ చైతన్యతో కలిసి రీల్‌ లైఫ్‌లో వెంకీ మామ చేశాడు. ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక త్వ‌ర‌లో తమిళ సూపర్‌ హిట్‌ అసురన్‌ రీమేక్ చేయ‌నున్నాడు.

Related posts