telugu navyamedia
సినిమా వార్తలు

పాపులారిటీ కోసం పాట్లు.. ప్రముఖులే వారి అర్ధనగ్న చిత్రాలతో.. 

celebrities in social media with half nude selfies
ఈ కాలంలో అందరికి పాపులారిటీ పిచ్చి బాగా పట్టింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఏమంటే, ఎక్కడ పడితే అక్కడ ఒక సెల్ఫీ దిగడం, దానిని వివిధ సామజిక మాధ్యమాలలో పెట్టడం. ఇది సామాన్యులు చేస్తే ఏమోలే అనుకోవచ్చు.. కానీ సమాజంలో మంచి పేరుప్రతిష్టలు ఉన్నవారు కూడా ఇదే పని చేస్తుండటం.. విచారకరం. వీరిని చూసి అభిమానులు ఇంకా విచ్చలవిడిగా తయారయ్యే పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తాజాగా, మరో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కూడా పబ్లిక్ చేసేస్తున్నారు. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం చేస్తోన్న పనులు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు బెడ్ రూమ్ ఫోటోలు, భార్యతో లిప్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు అలాంటి లిస్టు లోకి చేరిపోయాడు నటుడు ప్రతీక్ బబ్బర్. ఈ యంగ్ హీరో తన భార్యతో కలిసి అర్ధనగ్నంగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భార్య అర్ధనగ్నంగా నిలుచొని ఉండగా.. ఆమె ప్రైవేట్ పార్ట్ కవర్ చేస్తూ హీరో చేతిని అడ్డం పెట్టడం.. ఆ సమయంలో అతడి భార్య సెల్ఫీ తీయడం.. ఇదంతా చాలా బోల్డ్ గా ఉంది.

 

View this post on Instagram

 

more like it!.. happy valentines! 💋

A post shared by prateik babbar (@_prat) on

ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రతీక్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ పిచ్చి మరింత ముదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా దిగాజారలా..? అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ‘భాఘి 2’ సినిమాతో హిట్ అందుకున్న ప్రతీక్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే అతడు తన గర్ల్ ఫ్రెండ్ సాన్యా సాగర్ ని వివాహం చేసుకున్నాడు.

Related posts