telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ”పై అనుష్క స్పందన

Jersey-First-Look
గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం “జెర్సీ”. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం క్లాసిక్ హిట్‌గా నిలిచింది. సామాన్యుల‌తోపాటు సినీ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. ఇప్ప‌టికే రాజ‌మౌళి, ఎన్టీయార్, అల్లు అర్జున్ వంటి ఎంతో మంది సెల‌బ్రిటీలు “జెర్సీ”ని అభినందించారు. తాజాగా సీనియ‌ర్ హీరోయిన్ అనుష్క కూడా “జెర్సీ”పై ప్ర‌శంస‌ల వర్షం కురిపించింది. “సినిమాలోని మ్యాచ్ చూసిన త‌ర్వాత నా అనుభూతిని వ‌ర్ణించ‌డానికి మాట‌లు ఉండే బాగుండేద‌నిపిస్తోంది. నిజంగా ఇది నాకు ఫ్యాన్ మూమెంట్ (ఇది కేవ‌లం స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌). ఇలాంటి అద్భుత‌మైన సినిమాను అందించిన నానికి, గౌత‌మ్‌కు, చిత్ర‌బృందానికి ధ‌న్య‌వాదాలు” అని అనుష్క ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది.

Related posts