telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

బ్యాలెట్‌ పద్ధతిని అమలుచేసే ప్రసక్తే లేదు: సునీల్‌ అరోడా

No chance for EVM Tamparing: CEC
దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఆరోపణలు వెళ్లువిరుస్తున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సునీల్‌ అరోరా స్పందించారు. మళ్లీ బ్యాలట్‌ పద్ధతిని అమలుచేసే ప్రసక్తి లేదని ఆయన తేల్చిచెప్పారు. భవిష్యత్తు ఎన్నికల్లో ఈవీఎంనే వినియోగిస్తామని  అరోడా ప్రకటించారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరుగుతున్నాయంటూ కొన్ని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
గురువారం డిల్లీలో  జరిగిన ఒక సదస్సులో సునీల్‌ అరోరా మాట్లాడుతూబెదిరింపులకు, గద్దింపులకు భారత ఎన్నికల సంఘం భయపడదన్నారు. మళ్లీ చెపుతున్నా. ఇది నా ఒక్కడి మాట కాదు. ప్రస్తుత భవిష్యత్తు సీఈసీలు ఇదే వైఖరిని అవలంబిస్తారు.ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న కొన్ని రాజకీయ పక్షాల డిమాండ్‌కు తలొగ్గబోమని స్పష్టం చేశారు. మనుషుల సాయంతో బ్యాలెట్‌ బాక్సులను ఎత్తుకెళ్లడం పోలింగ్‌ సిబ్బందికి నరకంలా ఉంటుందన్నారు.  ఈవీఎంల పనితీరుపై ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

Related posts