telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు..

YS Jagan Files Nomination Pulivendul

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్‌ను సస్పెండ్ చేసిన విషయంలో మార్చి 11వ తేదీలోపు విచారణకు హాజరు కావాలంటూ జగన్‌ను సీఈసీ ఆదేశించింది. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. వ్యవస్థాపక అధ్యక్షుడినైన తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదంటూ ఆయన సీఈసీని ఆశ్రయించారు. శివకుమార్ ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల సంఘం జగన్‌కు నోటీసులు జారీచేసింది. శివకుమార్‌ను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.

కాగా, 2009లో శివకుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని స్థాపించారు. అనంతరం వైఎస్సార్ కుటుంబంపై వున్న అభిమానంతో పార్టీని జగన్‌కు అప్పగించారు. నాటి నుంచి జగన్ అధ్యక్షుడిగా, విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా, శివకుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శివకుమార్ టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్టానం శివకుమార్‌ను పార్టీ లో నుంచి బహిష్కరించింది.

Related posts