telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు వ్యాపార వార్తలు

చిత్తూర్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించిన సీసీఎల్

ccl limited

ఇంస్టెంట్ కాఫీ తయారు సంస్థ సీసీఎల్ ప్రాడక్ట్ లిమిటెడ్ ఏపీ లో ఉత్పత్తి ప్రారంభమైంది. చిత్తూర్ జిల్లా కువకొల్లి గ్రామంలో నెలకొల్పిన నూతన ఎస్ ఈజడ్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది ఫ్రీజ్ డ్రెడ్ ఇంస్టెంట్ కాఫీ తయారీ యూనిట్ గత కొంతకాలంగా ఇక్కడ ప్రయోగాత్మకంగా తయారీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అన్నీ రకాలుగా సన్నాహాలు పూర్తి కావడంతో ఇక పూర్తిస్థాయిలో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేపట్టారు.

యేటా 5,000 టన్నుల వార్షిక తయారీ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. సీసీఎల్ ప్రాడక్ట్ కు విజయవాడ సమీపంలోని దుగ్గిరాలలో ఒక యూనిట్, వియత్నాంలో మరొక యూనిట్లు ఉన్నాయి. చిత్తూర్ జిల్లాలో నెలకొల్పిన యూనిట్ మూడవది. దీంతో ఈ కంపెనీకీ తయారీ సామర్థ్యం గణనీయంగా పెరిగింది.

Related posts