telugu navyamedia
news study news trending

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ కీలక ప్రకటన చేశారు. బోర్డు పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ డిసెంబర్‌ 31న సాయంత్రం 6 గంటలకు వెల్లడిస్తానన్నారు. ఈ మేరకు ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి శనివారం రాత్రి ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ ప్రభావం విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో 2021లో సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే, మంగళవారం ఉపాధ్యాయులతో వర్చువల్‌ సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌.. సీబీఎస్‌ఈ 10, 12 తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండదని స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి తేదీలను కూడా ఆయన వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Related posts

రాఖీ పంపిన మహిళకు మోదీ ధన్యవాదాలు

vimala p

కేసీఆర్, జగన్ ల మధ్య నేడు మరోసారి చర్చలు!

vimala p

సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్న రాజశేఖర్

vimala p