telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నెల్లూరు జిల్లాకు కొత్తగా కేంద్రీయ విద్యాలయాలు: ఎంపీ ఆదాల

MP adala prabhakar nellore

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కావలిలో వచ్చే ఏడాది కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించామని, ఆయన ఈ విషయమై స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో ఎంపీ కోటా కింద 10 సీట్లు మాత్రమే కేటాయించేవారని దానిని 25 సీట్లుకు పెంచాలని మంత్రిని కోరడంతో ఈ ఏడాది నుంచే అమలు చేస్తామన్నారు.

నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో 25 సీట్లు పెంచడంతో జిల్లాకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులకు న్యాయం చేసే అవకాశం కలిగిందని తెలిపారు.నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరు నియోజక వర్గంలో గతంలో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసినప్పటికీ దానిని నిర్మించలేదన్నారు. దీనిపై కూడా కేంద్రమంత్రితో మాట్లాడి ఈ ఏడాదినుంచి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నగరానికి రింగురోడ్డు, రామాయపట్నం పోర్టు, బీచ్‌ రోడ్లు ఏర్పాటుకు కృషిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Related posts