telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అభిషేక్‌ బెనర్జీ ఇంటికి సీబీఐ అధికారులు…

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ.. పశ్చిమ బెంగాల్‌లో మాటల తూటాలు, దాడుల వరకు వరకు పరిస్థితి వెళ్లగా.. ఇప్పుడు కేసులు, కోర్టుల్లో నడుస్తోంది.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య యుద్ధమే జరుగుతోంది. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై పరువు నష్టం పిటిషన్ వేయగా.. తాజాగా, షాకు సమన్లు జారీ చేసింది కోర్టు.. మరోవైపు.. ఇవాళ అభిషేక్‌ బెనర్జీ ఇంటికి వెళ్లారు సీబీఐ అధికారులు.. బొగ్గు స్మగ్లింగ్‌ కేసులో అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సమన్లు జారీ చేశారు. అయితే, అభిషేక్‌ బెనర్జీ ఇంటికి సీబీఐ అధికారులు రావడం ఇదే తొలిసారి.. ఇప్పటికే ఈ కేసులో నాలుగు జిల్లాల్లో 13 చోట్ల తనిఖీలు నిర్వహించింది సీబీఐ.. ఇవాళ అభిషేక్‌ బెనర్జీ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను ప్రశ్నించింది. ఈ కేసులో అభిషేక్‌ బెనర్జీ కుటుంబానికి ముడుపులు అందినట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. కాగా, ఎన్నికల సమయం కావడంతో.. కేంద్రమే ఉద్దేశ్యపూర్వకంగా సీబీఐతో దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నాయి తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు. చూడాలి మరి ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది.

Related posts