telugu navyamedia
రాజకీయ

హర్యానా మాజీ సీఎం నివాసంపై సీబీఐ దాడులు

CBI,Ex-CM Bhupinder Singh
హర్యానా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హుడా నివాసంపై సీబీఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి ఢిల్లీలోని 30కి పైగా ప్రదేశాల్లో సీబీఐ దాడులు చేపట్టింది. 2005లో హర్యానాలోని పంచ్‌కులలో ఏజేఎల్‌కు ప్లాట్‌ను రీ అలాట్‌ చేయడంపై గత ఏడాది డిసెంబర్‌లో హుడాపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది.
ప్రియాంకా గాంధీ భరత్ రాబ‌ర్ట్ వ‌ద్రాకు అక్రమంగా  భూమి ఇచ్చార‌న్న కేసులో సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. భూపీందర్‌ సింగ్‌ హుడా హర్యానా సీఎంగా పనిచేసిన సమయంలో పంచ్‌కులలో 14 పారిశ్రామిక ప్లాట్‌లను నామమాత్రపు ధరకు కట్టబెట్టారని ఆయనపై సీబీఐ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts