telugu navyamedia
రాజకీయ

వీడియోకాన్ ఆఫీసులపై సీబీఐ దాడులు..దీప‌క్ కొచ్చార్‌పై కేసు నమోదు

CBI,videocon deepak kochar
దేశ వ్యాప్తంగా ఉన్న వీడియోకాన్ ప్రధాన కార్యాలయాలలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ చీఫ్ చందా కొచ్చార్ భ‌ర్త దీప‌క్ కొచ్చార్‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. అక్రమ పద్దతిలో వేల కోట్ల ఐసీఐసీఐ బ్యాంకు రుణాలు ఇచ్చిన స్కామ్‌లో ఈ కేసు న‌మోదు చేశారు. ఇదే కేసుకు సంబంధం ఉన్న వీడియోకాన్ అధిప‌తి వేణుగోపాల్ ధూత్ ఆఫీసులోనూ సీబీఐ రోజు  సోదాలు చేపట్టింది. ముంబైలోని వీడియోకాన్ కార్యాలయాలతో పాటు ఇత‌ర న‌గ‌రాల్లో ఉన్న ఆఫీసుల్లో సోదాలు జ‌రుగుతున్నాయి. 
2012లో వీడియోకాన్ తీసుకున్న రూ. 3,250 కోట్ల లోన్ కు సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో గత అక్టోబర్ లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చందా కొచ్చర్ తప్పుకున్నారు. ఈ వ్యవహారంలో చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, ఆమె కుటుంబసభ్యులు భారీ ఎత్తున లాభపడ్డారనే వార్తలు గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

Related posts