telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉన్నవో కేసు : .. ఎమ్మెల్యే తరువాత .. మరో ముగ్గురు వారం పాటు సామూహికంగా .. సీబీఐ నివేదిక..

cbi charge sheet on 3 more in unnav case

కోర్టు ఆదేశంతో ఉన్నవో కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఎట్టకేలకు ఢిల్లీలోని తీజ్ హజారీ కోర్టులో జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ ముందు ఛార్జిషీటు దాఖలు చేసింది. 2017వ సంవత్సరం జూన్ 4వతేదీన మైనర్ బాలికపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశాడని సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. ఎమ్మెల్యే సెంగార్ అనుచరుడైన శశిసింగ్ అమ్మాయికి ఆశ పెట్టి ఆమెను సెంగార్ ఇంటికి తీసుకువెళ్లాడని తేలింది. అత్యాచారం కేసులో శశిసింగ్ కూడా సహనిందితుడేనని సీబీఐ పేర్కొంది.

ఎమ్మెల్యే అత్యాచారం చేశాక వారం రోజులకు అంటే 2017 జూన్ 11వతేదీన నరేష్ తివారీ, బ్రిజేష్ యాదవ్ సింగ్, శుభం సింగ్ లు బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసింది. ఎమ్మెల్యే అనుచరుడైన శశిసింగ్ కుమారుడే బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన శుభం సింగ్ అని అధికారులు చెప్పారు.దీంతో ఈ ముగ్గురు నిందితులపై మరో కేసు నమోదు చేశారు. ఉన్నవో కేసులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడంతో కోర్టు జడ్జి ఈ నెల 10వతేదీన సాక్షులను విచారించనున్నారు.

Related posts