• Home
  • వార్తలు
  • సీబీఐని ఆయుధంలా వాడుకుంటున్న ప్రధాని..! రాహుల్ గాంధీ విమర్శలు
Trending Today రాజకీయ వార్తలు వార్తలు

సీబీఐని ఆయుధంలా వాడుకుంటున్న ప్రధాని..! రాహుల్ గాంధీ విమర్శలు

congress-chief-rahul-fire-to-modi-govt

బీజేపీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ఓ ఆయుధంలా తయారైందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు…. ఓ అవినీతి కేసులోసీబీఐ తాజాగా… తమ సొంత శాఖ డైరెక్టర్ రాకేశ్‌ అస్తానాపై కేసు నమోదు చేసిన విషయంపై స్పందించిన రాహుల్‌ గాంధీ… ‘మోదీకి అనుకూలంగా వ్యవహరించే గుజరాత్‌ క్యాడర్‌ అధికారి, గోద్రా పత్యేక దర్యాప్తు బృంద చీఫ్‌ ప్రస్తుతం లంచం తీసుకున్న కేసులో దొరికిపోయారు…

ప్రధాని మోదీ నాయకత్వంలో రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ఆయుధంలా సీబీఐని ప్రత్యేకంగా వాడుకుంటున్నారు. సొంతింటిపై (తమపై తామే) యుద్ధం జరుపుకొనే దిశగా ఆ వ్యవస్థను తయారు చేశారంటూ ట్వీట్‌ చేశారు…. కాగా, మాంసం ఎగుమతి చేసే వ్యాపారవేత్త మోయిన్‌ ఖురేషిపై మనీలాండరింగ్‌, అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు రావడంతో ఖురేషిపై సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి విదితమే… ఈ కేసులో రాకేష్‌ అస్తానా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం (సిట్‌) ఏర్పాటైంది. అయితే, ఖురేషి నుంచి ఆయన లంచం డిమాండ్‌ చేశారని, లంచం పుచ్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి…

దీనితో ఈ కేసులో అస్తానాను నంబర్‌.2 గా పేర్కొంటూ సీబీఐ అధికారులు కేసు నమోదు చేయడమే కాకుండా సిట్ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్ అధికారిపై కూడా కేసు నమోదైంది. మరోవైపు, ఫిబ్రవరి 2002లో గోద్రాలో శబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలును తగులబెట్టిన కేసులో దర్యాప్తు జరిపిన బృందానికి కూడా 1984 బ్యాచ్‌కి చెందిన గుజరాత్‌ క్యాడర్ అధికారి అస్తానా చీఫ్‌గా వ్యవహరించారు. ఆయన మోదీకి అత్యంత సన్నిహితుడని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంది..

Related posts

ఫ్లాష్ న్యూస్ : రైతుబంధు పథకంలో నగదు బదిలీ నిలిపివేత

jithu j

పట్టాభిషేకం…

chandra sekkhar

కన్నకూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం చేస్తున్న తండ్రి… జైలునుంచి తిరిగొచ్చి మరీ

nagaraj chanti

Leave a Comment