telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

షుగర్‌ ఎక్కువగా ఈ గ్రూప్‌ వారికే వస్తుంది…తస్మాత్ జాగ్రత్త !

షుగర్‌ వ్యాధి ప్రస్తుత కాలంలో చాలా కామన్‌ అయిపోయింది. ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికీ వస్తుంది.  ఆహార అలవాట్లు, వంశపారంపర్యాల కారణంగా షుగర్ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిని అంటుకున్నాయి. 40 దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు. ఇలాంటి స్థితిలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా….మన ప్రాణాలకే ప్రమాదం. షుగర్లు వాటి చేతుల్లోకి మనల్ని తీసుకొకముందే…మనమే వాటిని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి లేదంటే చాలా డేంజర్.  అయితే ఈ షుగర్‌ ఎవరికి ఎక్కువగా వస్తుందో చూద్దాం. అన్ని బ్లడ్‌ గ్రూప్‌లలో పోలీస్తే.. బీ గ్రూప్‌ వారికి డయాబెటిస్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందట. వాన్‌ విల్లెబ్రాండ్‌ అని పిలువబడే ప్రోటీన్‌ వీరి రక్తంలో ఎక్కువగా ఉంటుందట. ఇది బ్లడ్‌లో షుగర్‌ స్థాయిలను పెంచుతుందని వెల్లడైంది. అందుకే వీరలో ఎక్కువగా డయాబెటిస్‌ వచ్చే అవకాశముందని, టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడేవారు శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా జాగ్రత్తపడాలని డాక్టర్లు చెబుతున్నారు.  

ఈ నియమాలు పాటిస్తే షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది…

రోజూ కాసేపు వాకింగ్‌ చేయాలి
ఎక్కువ నీళ్లు తాగిలి
కాకరకాయ ముక్కలను నీటిలో మరిగించి తాగాలి
ప్రతిరోజూ తులసి ఆకులను తినాలి
రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి
అప్పుడప్పుడు వెల్లుల్లి తినాలి
కాఫీ, టీకి బదులు గ్రీన్‌ టీ తాగాలి
మొలకెత్తిన గింజలను తినాలి

Related posts