telugu navyamedia
health news trending

కాలీఫ్లవర్(గోబీ) తో… ఆరోగ్యం…

cauliflower and its health secrets

కాలీఫ్లవర్(గోబీ) సాధారణంగా తీసుకునే ఒక కూర. అయితే అది చాలా మేలుచేస్తుంది అని కొద్దీ మందికే తెలుసు. శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే ఆహారాలలో ఇది ప్రధానంగా ఉంటుంది. శరీరంలో అధిక వేడిని ఇది నియంత్రించగలదు. జీర్ణ శక్తిని పెంచుతుంది. వ్యాధుల బారిన పడిన వారు రోజు ఈ ఆకులను సలాడ్ మాదిరి తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. దీనివలన అసలైన ప్రయోజలు మరికోన్ని.. చూద్దాం.

ఈ కాలీఫ్లవర్ ఆకులను సలాడ్ మాదిరిగా రోజు 50గ్రా. చొప్పున తీసుకుంటే, దంత సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందగలం. దంతాలు, చిగుళ్లు దృడంగా అవడానికి ఈ ఆకులు ఉపకరిస్తాయి.

అలాగే ఈ సలాడ్ తీసుకోవడం వలన వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. దీనితో వెంట్రుకలు ఒత్తుగా, దృడంగా పెరుగుతాయి.

రోజు పరగడుపున, కాలీఫ్లవర్ రసాన్ని తాగితే జీర్ణాశయం, పేగులు శుభ్రపడతాయి. తద్వారా వచ్చే క్యాన్సర్ లాంటి వ్యాధుల నుండి దూరంగా ఉన్నవాళ్ళం అవుతాము.

శరీరంపై ప్రమాదాల వలన అయినా గాయాలకు కాలీఫ్లవర్ ఆకుల రసాన్ని రాస్తే అవి త్వరగా తగ్గుముఖం పడతాయి. మచ్చలు కూడా త్వరగా తగ్గిపోతాయి.

Related posts

నా మొదటి ఓటు మానాన్నకే వేసే అవకాశం..

vimala p

ప్రజల మధ్య ఉండి సమస్యలపై పోరాడుతా: రేవంత్‌

vimala p

చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది!

vimala p