Category : వార్తలు & టిప్స్

Health Tips

ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

వేసవిలో తినకూడని ఆహార పదార్థాలు ఇవే…!

admin
వేసవి కాలంలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరం విషయంలో సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటకు రాకూడదు. ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ రాసుకోవాల్సిందే. కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకోవాలి. లేదా
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

వేసవిలో రక్షణకు పుచ్చకాయ చేసే మేలు

admin
అప్పుడే ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చల్లచల్లగా ఏదైనా తినాలన్పిస్తూ ఉంటుంది. అయిత్ చాలామంది జ్యూస్ లు, శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. కానీ వీటన్నింటికన్నా సహజంగా పండే పండ్లు తినడం
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

మీది ఏ రకమైన చర్మమో తెలుసుకోండి

admin
చాలామందికి వారిది ఏ రకమైన చర్మం అనే సందేహం ఉంటుంది. సాధారణంగా మూడు రకాల చర్మం ఉంటుంది. అందులో సాధారణ చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం ఉంటాయి. మీ చర్మం ఏ రకంగా
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

ఎండాకాలంలో చర్మాన్ని సంరక్షించండిలా…

admin
ఎండాకాలం వచ్చిందంటే చర్మానికి చాలారకాల సమస్యలు వచ్చిపడతాయి. ముఖ్యంగా చర్మం జిడ్డుగా తయారవడం, ఎండకు చర్మం కందిపోవడం వంటివి జరుగుతాయి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన చర్మాన్ని ఎండనుంచి సంరక్షించుకోవచ్చు. * వీలైనంత
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

చిరుధాన్యాలతో ఉపయోగాలివే…!

admin
ఇంట్లోనే పండక్కో లేదా ఏదో వేడుకకో పిండివంటలు చేసుకోవడం మన పెద్దల కాలంలో జరిగేవి. ఇప్పుడు తీరిక లేక ఏదోఒకటి కొనుక్కోమని పిల్లలకు డబ్బులు ఇవ్వడం, వారు దుకాణాలలో ఏది దొరికితే అది తినేయడం
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

నీరు…

admin
నీరు ప్రాణకోటికి ఆధారం. మానవ శరీరానికి కూడా నీరు అంతే ముఖ్యం. మానవ శరీరంలో 80 శాతం నీరు ఉండటమే దీనికి నిదర్శనం. మరి శరీరానికి అవసరమైన మేరకు నీరు అందించడం ఎలా..?  రోజుకు 3 నుండి 4 లీటర్ల నీటిని తాగమని పెద్దలు చెబుతూనే ఉంటారు. శరీరానికి మనంఅందించే ఆహారంలో ఘన పదార్దాలతో పాటు ద్రవ పదార్దాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడంలోని ప్రాముఖ్యత శరీరంలో నీటి అవసరాలను తీర్చడం కోసమే.  ద్రవ పదార్దాలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది శీతల పానీయాలు.  కానీ శరీర నీటి అవసరాలు ఈ పానియాలు తీర్చలేవు సరికదా వీటివల్ల రకరకాల దుష్ప్రయోజనాలు తలకెత్తుకున్నట్టే. వీటి బదులుగా ఆయా కాలాలలో లభించే పండ్ల రసాలు తీసుకోవడం చాలా మంచిది. పండ్ల రసాలుఅనగానే వీధి బండ్లలో చేతికొచ్చినంత చక్కెర, ఐస్ వేసి తాగితే అవికూడా ప్రమాదకరమే. ఇళ్లలో ఉన్నపుడు పండ్ల రసాలు చేసుకు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం పనికిరాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా… దానికి అనుగుణంగా వీలైనప్పుడుపండ్ల రసాలు, అవి అందుబాటులో లేని సమయాలలో (ఉదాహరణకి ఆఫీస్ లోనో లేక పనిమీద వేరే చోటో ఉన్నపుడు) నీరు తాగుతూ శరీర నీటి అవసరాలను సమతుల్యం చేస్తూ ఉండాలి.  ఆయా కాలాలకు అనుగుణంగా నీటిని శరీరానికి అందించాలి. ఉదాహరణకి వానాకాలం అనుకోండి, ఆ కాలంలో నీటిని గోరువెచ్చగా తీసుకుంటే మంచిది. ఏకాలంలో అయినా నీటిని బాగా మరిగించి చల్లార్చి తాగాలి.  నీటి అవసరం ఏ వయసు వారికైనా ఒకే విధంగా ఉంటుంది. నీరు తాగటం వల్ల శరీరం తనలోని రకరకాల వ్యవస్థలను శుభ్రపరచడానికి ఉపయోగిస్తుంది. అటువంటి ప్రక్రియ జరగటం వల్లనే నిత్యం ఎన్నో వ్యర్దాలు తయారయ్యే శరీరంలో శుభ్రత జరిగి శరీరం ఆరోగ్యంగా ఉండగలదు. ఈ అంతరశుద్ధి జరగటం మన జీర్ణవ్యవస్థకు, రక్త శుద్ధికి ఎంతో మేలు చేకూరుతుంది. తద్వారా ఆయా వ్యవస్థల పనితీరులో లోపాలు చోటు చేసుకోకుండా ఆరోగ్యంగా ఉండగలం. శరీరంలో నీరు తగ్గితే ఏమవుతుంది.. ఊరికే ఆలోచిద్దాం. మనకు సాధారణంగా తలనొప్పి వచ్చి తల్లడిల్లిపోతాం .. దీనికి  ఒక కారణం శరీరానికి తగిన నీరు అందించకపోవడమే. మలబద్దకం.. దీనికి కూడా ప్రధాన కారణం శరీరంలో నీటి అవసరం తీర్చలేకపోవడమే.  దీనిని అరికట్టడానికి పొద్దున్నే తాగగలిగినన్నినీళ్లు (కనీసం లీటరు నీరు) తాగితే, లోనికి వెళ్లిన నీరు దాని పని అది చేసుకుపోతుంది. మొదట్లో వట్టి నీరు తాగాలి అనిపించకపోవచ్చు అందుకని అందులో కొంచం ఉసిరిపొడి లేదా నిమ్మకాయ రసం పిండుకొని తాగండి రుచికి రుచి, ఆరోగ్యానికిఆరోగ్యం.  ఇక మిగిలిన సమయాలలో అయితే అల్పాహారం తరువాత ఒక గంట ఆగి కొంచం దాహంగా అప్పటికే అనిపిస్తుంది అది గమనించి తగినన్ని నీరు తాగాలి. ఇక భోజనం తరువాత రెండు గంటల తరవాత గాని నీరు తాగకూడదు. తిన్నాక దాహం వేస్తె కొంచంగా అంటే ఒకటో రెండో గుక్కలు తాగిసరిపెట్టుకోవాలి. సాయంత్రం అదే రెండవ సారి అల్పాహారం తీసుకునే సమయంలో వారివారి శరీర అవసరాలకు అనుగుణంగా పండ్ల రసాలు తాగటం మంచిది. యధావిధి అల్పాహారం తరువాత గంట ఆగి దాహానికి తగ్గట్టు నీరు తాగాలి. నీరు ఎండాకాలంలో ఎక్కువ తాగాలని లేదు. సాధారణ ఋతువులలో తగినట్టే తాగుతూ వేసవిలో లభ్యమయ్యే కూరగాయలను, పండ్లను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. తద్వారా వేసవి తాపానికి గురికాకుండా శరీరం మన రోజు వారి కార్యక్రమాలకు ఉత్సహంగా సహకరిస్తుంది.  నీటిని తీసుకునే అలవాటు మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి బలవంతంగా తాగరాదు. నీటిని ఉదయం నుండి సాయంత్రం 6 గంటలవరకు మాత్రమే తాగాలి అని పెద్దలు చెపుతారు. ఈ నీటిని తీసుకునే ప్రణాళిక నిత్యం అనుసరించాలి. ముఖ్యగమనిక ఈ విశ్వంలో ఎటుచూసినా నీరే ఉందికదా నీటిని జాగర్తగా వాడుకోండని ఎందుకు ఇంత భారీ ప్రచారం చేస్తున్నారు అని చాలా హాస్యప్రదమైన సందేహం వస్తుంది.  మన చుట్టూ ఉన్న నీటిలో 3 శాతం మాత్రమే తాగడానికి అనువైనది, అందులోను 1 శాతమే అందుబాటులో ఉంది.మిగిలిన 2 శాతం మంచు రూపేణా తాగడానికి అనువుగా లేకుండా పోయింది. అందుకే 84 కోట్ల జీవరాశులకు ఆధారం నీరే, అటువంటి నీటిని జాగర్తగా వాడుకుని, నీరు అనే సహజ సంపదను తరువాత తరాలకు అందచేయడానికి కృషి చేద్దాం. నీరు ప్రాణకోటికి ఆధారమే, జాగ్రత్తగా వాడుకుని అందరం బ్రతుకుదాం… బ్రతకనిద్దాం… -చంద్రశేఖర్ రెడ్డి  
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

గాయత్రీ మంత్రం జపిస్తున్నారా ?

admin
“గాయతాం త్రాయతే ఇతి గాయత్రీ” అనగా జపించేవారిని తరింప జేస్తుంది కనుక ఈ మంత్రాన్ని గాయత్రీ అని అంటారు. గాయత్రీ మంత్రము: “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే….?

admin
* ఒక రోజు సమయంలో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో ! * నీ ఒత్తిడిని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

శరీంలోని వేడిని తగ్గించాలా…?

admin
ఎండలు మండిపోతున్నాయి. దానికి తోడు శరీరం కూడా వేడిగా ఉంటుంది. ఎందుకు మన శరిరం వేడిగా ఉంటుంది ? శరీరం వేడి కావడానికి పిత్తం మూల కారణం. అసలు పిత్తం అంటే ఏమిటంటే మన
ఆరోగ్య వార్తలు వార్తలు & టిప్స్

రేగిపండు తింటే అద్భుతాలే…..

admin
రేగిపండ్ల చెట్టుకి ముళ్ళు ఎంత పదునుగా ఉంటాయో పండ్లుకూడా అంతే రుచిగా ఉంటాయి. శీతాకాలంలో దొరికే పండ్లలో రేగిపళ్ళు పండ్లు కూడా ఉంటాయి. ఇవి వేసవి కాలంలోకూడా దొరుకుతాయి. ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నా