telugu navyamedia
సినిమా వార్తలు

రీల్ కాదు రియల్ : షూటింగ్ లో చిత్రబృందంపై దాడి… దర్శకుడికి గాయాలు

“ఫిక్సర్” అనే వెబ్ సిరీస్ ను ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చిత్రబృందంపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న నటి తిగ్మాంషు ధులియా దాడికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ట్విట్టర్ లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తమపై దాడి ఎలా జరిగిందనే విషయాన్ని వెల్లడించారు. షూటింగ్ జరుగుతుండగా, నలుగురైదుగురు యువకులు కర్రలతో తమ దగ్గరకు వచ్చి దాడి చేశారని, మొదటి కామెడీ అనుకుంటే నిజంగానే దాడి చేయడంతో షాకయ్యామని చెప్పారు. ఈ దాడిలో దర్శకుడు ఓ కెమెరామెన్ కి తీవ్ర గాయాలు కాగా… సోహమ్ షా కింద పడిపోయాడని, తమ మీద దాడి చేసిన వారు ఆ ప్రాంతంలో రౌడీలుగా చెలామణి అవుతున్నారని చెప్పారు. షూటింగ్ చేయడానికి ముందే పర్మిషన్ తీసుకున్నామని, దానికి సంబంధించిన డబ్బు కూడా చెల్లించామని దర్శకుడు సోహమ్ షా వెల్లడించారు. కానీ వారి అనుమతి లేకుండా అక్కడ షూటింగ్ చేయకూడదనే కారణంతో సదరు గ్యాంగ్ తమను హెచ్చరించిందని నటి ధులియా చెప్పారు.

Related posts