telugu navyamedia
సినిమా వార్తలు

అలనాటి స్టార్ హీరోయిన్ పై కేసు… బాలికపై లైంగిక దాడి…

BhanuPriya

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నటి భానుప్రియ. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దక్కించుకుంటున్న ఈ సీనియర్ హీరోయిన్ గురించి ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది. తాజాగా ఆమె ఓ 14 ఏళ్ళ బాలికను వేధిస్తోందంటూ కేసు నమోదైంది. సామర్లకోటలో నిరుపేద కుటుంబానికి చెందిన ప్రభావతి అనే మహిళ భానుప్రియ ఇంట్లో తన 14 ఏళ్ళ కూతురిని చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పనికి పెట్టింది. పనికి కుదిరిన మొదట్లో తన కూతురిని అప్పుడప్పుడు ఇంటికి పంపిస్తుండేవారని, ఫోన్లో బాగానే మాట్లాడించేవారని, కానీ ఇప్పుడు తన కూతురును వేధిస్తున్నారంటూ భానుప్రియపై బాలిక తల్లి ప్రభావతి వాపోయింది. ఏడాది నుంచి తన కూతురిని ఇంటికి పంపకుండా, భానుప్రియ సోదరుడు తన కుమార్త పట్ల నీచంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ప్రభావతి ఆరోపించింది. ఈ విషయంపై చెన్నై చైల్డ్ హెల్ప్ లైన్ కు కూడా సమాచారం వెళ్లిందని తెలుస్తోంది. హీరోయిన్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించిన భానుప్రియ ఇలాంటి పని చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts