telugu navyamedia
రాజకీయ

బలవంతపు వసూళ్లు.. మాజీ స్పీకర్ కోడెల కుమారుడిపై కేసు

all set ready to kodela son arrest
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ పై కేసు నమోదయింది. శివరామ్, ఆయన అనుచరులు మామూళ్లు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని కె.మల్లికార్జునరావు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో గుంటూరు వన్ టౌన్ పోలీసులు ఈరోజు కేసు నమోదుచేశారు. ఈ విషయమై మల్లికార్జునరావు మాట్లాడుతూ..నరసరావుపేట శివారు రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అపార్ట్‌మెంట్‌ నిర్మించేందుకు అనుమతుల కోసం నేను ఇంజనీర్ వేణును సంప్రదించాను. ఈ సందర్భంగా అతను కోరిన నగదును అందజేశాను. 

కానీ అతను అనుమతులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చాడు.చివరికి భవన నిర్మాణం సగం పూర్తయ్యాక కోడెల కుమారుడు శివరామ్ కు డబ్బులు  చెల్లిస్తేనే భవన నిర్మాణం పూర్తి అవుతుందని ఇంజనీర్ వేణు బెదిరించాడు.  దీంతో పోలీసులను ఆశ్రయించానని బాధితుడు మల్లికార్జున రావు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కోడెల తనయుడు కోడెల శివరామ్ తో పాటు అతని పీఏ గుత్తా ప్రసాద్, ఇంజినీర్‌ వేణులపై పోలీసులు కేసు నమోదుచేశారు.

Related posts