telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

క్యారెట్ తో.. డయాబెటిస్ కు చెక్.. ఇలా.. !

carrot juice for type 2 diabetics

వయోనిమిత్తం లేకుండా ప్రస్తుతం అందరికి ఎదురవుతున్న సమస్య డయాబెటిస్. దీనిలో రకరకాల స్థాయిలు కూడా ఉంటాయి. ఆయా స్థాయిలను బట్టి ఆహారపు అలవాట్లలో జాగర్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తీసుకునే ఆహారంలో కొన్ని పదార్దాలు చాలా మేలు చేస్తుంటాయి. వాటిని తీసుకోవడంతో సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ ఆహారంలో క్యారట్ ముఖ్యంగా చెపుతున్నారు వారు. అది జ్యూస్ గా తీసుకుంటే ఇంకా ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొన్నారు.

టైప్ 2 డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ కంట్రోల్ చేయ‌వ‌చ్చు అంటున్నారు నిపుణులు. ఈ విష‌యాన్ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే టైప్ 2 డ‌యాబెటిస్ నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ పరిశోధకులు చెబుతున్నారు.

క్యారెట్ల‌లో ఉండే బీటా కెరోటిన్‌ను మ‌న శ‌రీరం విట‌మిన్ ఎ కింద మార్చుకుంటుంది. ఈ విట‌మిన్ ఎ ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌ద్వారా ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు స‌మ‌తుల్య‌మ‌వుతాయి. దీనితో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అందువ‌ల్ల నిత్యం క్యారెట్ జ్యూస్ తాగాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

అయితే క్యారెట్ల‌లో పిండి పదార్థాలు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ అవి షుగ‌ర్ ను పెంచ‌వ‌ని, అందువ‌ల్ల ఇబ్బంది ఏమీ ఉండ‌ద‌ని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే టైప్ 2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచ‌వ‌చ్చు.

Related posts