telugu navyamedia
ఆరోగ్యం

యాలుకల వలన కలిగే లాభాలు ఎన్నో…!

మనదేశం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది.. ఇక్కడ అన్నిటికన్నా ఖరీదైని కుంకుమపువ్వు..ఆ తర్వాత స్థానం యాలకులదే. యాలకులు అంటేనే వాటి రుచి, సువాసన మనకు గుర్తొకొచ్చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో వీటికి మించినవి లేవు. వంటలో రుచిని పెంచడమే కాదు.. ఇలాచీ వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

యాలకులు జేబులో వేసుకుంటే డబ్బులొస్తాయో.. రావో అనే విషయం పక్కన పెడితే నోట్లో వేసుకుంటే మాత్రం నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇవి చాలా అనారోగ్యాలకు చెక్ పెడతాయి.  యాలకులు రుచి, సువాసన తో మన టెన్షన్స్ ని పోగొడుతుంది. యాలుకలు ఆకుపచ్చ రంగు లో మరియు నలుపు రంగులో కూడా దొరుకుతూ ఉంటాయి.

బంగారంతో పోటీ పడుతున్న యాలకులు.. | Cardamom prices to increase | TV9 Telugu

*కఫం, దగ్గు ఊపిరాడక పోవడం, చాతి దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలను కూడా యాలుకలు చిటికె లో తరిమికొడతాయి.
*యాలకులు నానబెట్టిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
* సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకుల బాగా ఉపయోగ పడతాయి.
* రోజుకో ఇలాచీ తింటే.. జీర్ణక్రియ పనితీరు మెరుగు పడుతుంది. కడుపులో గ్యాస్ సమస్యలు మటుమాయం అవుతాయి.
*లీటర్ నీటిలో కొన్ని యాలకులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయానే వాటిని గోరువెచ్చని నీటితో కలిపి తాగాలి. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు తాగొచ్చు. ఉదర సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి. షుగర్ కూడా అదుపులో ఉంటుంది.
* ఇలాచీలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇది సహయపడుతుంది.
* యాలకుల్లోని ఆయుర్వేద గుణాలు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
యాలకులు నానబెట్టిన నీరు తాగితే.. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని ఔషద గునాలు శరీర అలసటను కూడా తగ్గిస్తాయి.
* యాలకుల నీరు వివిధ రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. బరువును తగ్గించడంలోనూ సహయపడుతుంది.
ఒళ్లు నొప్పులకు యాలకులు మంచి ఔషధం. యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం వేస్తే తలనొప్పి చిటికెలో మాయమవుతుంది.

Related posts