telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

మనీ విత్ డ్రా కి .. కొత్త పద్దతి.. : ఎస్‌బీఐ

card less withdrawal from sbi

ఎస్‌బీఐ (భారతీయ స్టేట్ బ్యాంకు) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫాం యోనోపై కొత్తగా ‘యోనో క్యాష్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యాష్‌తో దేశవ్యాప్తంగా 16,500కుపైగా ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లలో కార్డు అవసరం లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టిన దేశంలోనే తొలి సంస్థగా ఎస్‌బీఐ ప్రాముఖ్యాన్ని పొందింది.

ఈ సదుపాయం ఉన్న ఏటీఎంలను ‘యోనో క్యాష్ పాయింట్’గా వ్యవహరించనున్నారు. వినియోగదారులు ఈ పాయింట్‌లోకి వెళ్లిన తర్వాత కార్డు రహిత విత్‌డ్రాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. అనంతరం ఖాతాదారుడి మొబైల్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరు అంకెల రిఫరెన్స్ నంబరును ఎంటర్ చేయడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ పని 30 నిమిషాల్లోగా పూర్తిచేయాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.

Related posts