telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

కారు కొన్నారు.. 66 బస్తాల చిల్లరతో.. 17మంది 3 రోజులు లెక్కబెట్టారు..

car purchase with 66 bags of change

ఆసక్తికర ఘటనలు చైనా లో చాలానే జరుగుతుంటాయి. తాజాగా, చైనా హెబీయి ప్రావిన్స్ లోని కాంగ్ ఝౌ నగరంలో ఓ మహిళ ఫోక్స్ వాగన్ కార్ల షోరూంకు ఏకంగా 66 బస్తాల చిల్లర నాణేలతో వచ్చి అక్కడి సిబ్బందికి నిజంగానే అగ్నిపరీక్ష పెట్టింది. ఆ మహిళ ఫోక్స్ వాగన్ పసాట్ మోడల్ కారు కొనుక్కోవాలని వచ్చింది. అయితే చెక్కులు, నోట్లకు బదులు నాణేలు తీసుకురావడంతో అవి లెక్కించేందుకు షోరూం సిబ్బందికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఏకంగా 17 మంది సిబ్బంది ఆ 66 బస్తాల్లోని నాణేలు లెక్కించేందుకు మూడు రోజుల సమయం పట్టింది.

car purchase with 66 bags of change మూడు విడతల్లో ఆ మహిళ కూడా ఈ చిల్లర బస్తాలను తీసుకువచ్చింది. అది మొదలు సిబ్బంది షోరూంలో నేలపై కూర్చుని లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు. కొందరు నాణేలను యువాన్లు, జియావోలుగా విభజన చేస్తుంటే, మరికొందరు వాటిని కుదురుగా పేర్చుతూ ఎట్టకేలకు మూడ్రోజులకు లెక్కింపు పూర్తిచేశారు. ఇంతకీ ఆమె తెచ్చింది 1,30,000 యువాన్లు (భారత కరెన్సీలో రూ.13 లక్షలు).

Related posts