telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

క్యాప్సూల్ విస్కీ.. ఇదో కొత్త కిక్కు.. ఎక్కడైనా వాడేసుకోవచ్చు..

capsule whisky a new way alcohol

గ్లెవ్లీవెట్ అనే సంస్థ మందుప్రియులకు కొత్త అనుభూతిని అందించే ఉద్దేశ్యంతో మందుబాబులకు కాసింత వెరైటీగా కిక్కు ఇద్దామని అనుకున్నది. అనుకోవటమే ఆలస్యం. స్కాచ్ విస్కీ తయారు చేసే ఈ కంపెనీ విస్కీని క్యాప్సూల్స్ లో నింపేసింది. డాక్టర్లు రిసిచ్చే మందులు ఎలాగూ ఇపుడు క్యాప్సూల్స్, బిళ్ళల రూపంలో దొరుకుతున్నాయిగా. అదే పద్దతిలో పై కంపెనీ విస్కీని కూడా క్యప్సూల్స్ లో నింపేసింది. అంటే క్యాప్సూల్ విస్కీ అన్నమాట. ఈ క్యూప్సూల్ విస్కీని కొనుక్కుని నోట్లో వేసుకుని కొరికితే చాలు. ఆ మజానే వేరంటోంది సదరు కంపెనీ. తమ కంపెనీ తయారు చేసిన క్యాప్సూల్ విస్కీని కొంటే షోడాలు, కూల్ డ్రింక్, వాటర్, ఐస్ క్యూబ్ ఏవీ అవసరం లేదని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఒక్క క్యాప్సూల్ ను నోట్లో వేసుకుని కొరికితే వెంటనే చిక్కటి ద్రవం నోట్లోకొచ్చేస్తుందట. అదే విస్కీ తాగిన అనుభూతిని, కిక్కును ఇస్తుందని కంపెనీ వివరిస్తోంది.

డిస్సాల్వబుల్ విస్కీ క్యాప్సూల్స్ గా పిలిచే ఈ విస్కీని సముద్రపు నాచును పై పొరలుగా వాడుతున్నట్లు కంపెనీ చెప్పింది. పై పొరతో కలిపే విస్కీని మింగేయొచ్చట. పొరను మింగటం వల్ల ఎటువంటి అనారోగ్యం కలగదని కంపెనీ హామీ కూడా ఇస్తోంది. ఈ పొరను మింగిన ఆరు వారాల్లోగా కరిగిపోయి రక్తంలో కలిసిపోతుందని కూడా చెబుతోంది. అంటే మనం తీసుకుంటున్న పండ్లలోని పీచు పదార్ధం కన్నా తొందరగానే జీర్ణం అయిపోతుందన్నమాట. ఈ విధానం అమలులోకి వస్తే ఇంట్లోనే కాదు ఎక్కడైనా ఎవరికీ అనుమానం రాకుండా ఏ టాబ్లెట్టొ వేసుకున్నట్టుగా ఒకటి నోట్లో వేసుకొవచ్చు. ఇది మందుబాబులకు హాయిగా అనిపించినా .. వారి కుటుంబ సభ్యులకు మాత్రం కాస్త కష్టకాలం అనే చెప్పాలి. ఎందుకంటే భార్యకు తెలియకుండా భోజనానికి ముందు లేదా పడుకునే ముందు ఒక్క క్యాప్సూల్ నోట్లో వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా!!

Related posts