రాజకీయ వార్తలు

ఇండిగో, గోఎయిర్‌ సంచలన నిర్ణయం

విమానయాన ప్రయాణికులకు ఇండిగో, గోఎయిర్‌ సంస్థలు ఒకబ్యాడ్ న్యూస్ ను ప్రకటించాయి. ఇండిగో, గోఎయిర్‌ ఈ రెండు సంస్థలు కలిసి  ఈ నెలలో దాదాపు 600కి పైగా దేశీయ విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిసింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు గురువారం ఎయిర్‌లైన్స్‌ సమర్పించిన షెడ్యూల్‌లో వివరాలు వెల్లదించాయి ఆ రెండు సంస్థలు. ఇండిగో, గోఎయిర్‌ ఈ రెండు సంస్థలు కలిసి రోజూ దాదాపు  1200 విమానాలను నడుపుతున్నాయి.
 
అయితే  ఇండిగో 488 విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగా.. గోఎయిర్‌ 138 విమానాలను రద్దు చేయబోతున్నట్టు తెలిసింది. రద్దు అయిన విమానాల జాబితాలను ఈ విమానయాన సంస్థలు తమ సంబంధిత వెబ్‌సైట్లలో పొందుపరిచినట్లు తెలిపాయి. 
 
ఈ రెండు విమానయాన సంస్థలు ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలను ఆఫర్‌ చేస్తుండటంతో పాటు, మొత్తం నగదును రీఫండ్‌ చేయనున్నట్టుగా ఆ సంస్థలు తెలిపాయి. 
 
 ఫ్రాట్‌, విట్నీ తయారు చేసిన ఇంజిన్లలో తలెత్తిన సమస్యల కారణంగా ఈ సంస్థలు తమ విమానాలను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థలు తెలిపాయి.  ఇప్పటి వరకు మార్చి 15 నుంచి 31 మధ్యలో ఇండిగో 488 విమానాలను క్యాన్సిల్‌ చేయగా.. గోఎయిర్‌ మార్చి 15 నుంచి 22 వరకు 138 విమానాలను రద్దు చేసింది.

Related posts

మహేష్ ను మెచ్చిన కేటీఆర్…

admin

నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం: నారా బ్రహ్మణి

madhu

కోమటిరెడ్డి, సంపత్ ల కేసు తీర్పు …

admin

Leave a Comment