telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఏటీఎం నుంచి రూ.10 వేలు డ్రా చేస్తా.. ఇకపై ఓటీపీ ఎంటర్ చేయాలి!

canera bank atm Hyd

భారీ మొత్తాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసే సమయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఓటీపీ విధానం అందుబాటులోకి రానుంది. కెనరా బ్యాంకు తన ఏటీఎం నగదు లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఇకమీదట కెనరా బ్యాంకు ఏటీఎంల నుంచి రూ. 10,000, ఆపై మొత్తాలను విత్ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. వినియోగదారుడి ఖాతాతో అనుసంధానమైన ఫోన్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే నగదు బయటికి వస్తుంది. భారీ మొత్తాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసే సమయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఈ ఓటీపీ విధానం నిరోధిస్తుందని కెనరా బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.

Related posts