telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

టమోటాలు తింటే కిడ్నీలో రాళ్ళు…?

Tomato

టమోటాలు లేనిదే మన వంటకాలు పూర్తికావు. ఎందుకంటే.. టమోటా లేకపోతే రుచిపచి ఉండదు. అందుకే, మనవాళ్లు ప్రతి వంటల్లో టమోటాలను వేస్తుంటారు. టమోటాలు కేవలం రుచి మాత్రమే కాదు.. శరీరానికి కావల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. ఇందులో విటమిన్-Cతోపాటు విటమిన్-A, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ రోగులకు సైతం టమోలు మేలు చేస్తాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఈ వేసవిలో టమోలు తినడం ఆరోగ్యానికి మంచిది. ఇవి వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. అయితే, టమోటాలు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు పడతాయని అంటారు. ఎముకలు దృఢంగా ఉండేందుకు కాల్షియం ఎంత ముఖ్యమో తెలిసిందే. శరీరంలో కాలేయం నుంచి కొంత కాల్షియం ఉత్పత్తి అవుతుంది. ఎముకలు, కండరాలు ఈ కాల్షియంను రక్తం నుంచి గ్రహిస్తాయి. రక్తంలో ఎక్కువగా ఉండే కాల్షియం కిడ్నీల్లోకి చేరుతుంది. అవి మూత్రం ద్వారా బయటకు చేరాలి. మోతాదుకు మించిన కాల్షియాన్ని మూత్రపిండాలు విసర్జించలేవు. దీంతో అవి క్రమంగా పేరుకుపోయి రాళ్లుగా మారతాయి. టమోటాల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు సహకరిస్తాయి. అయితే, ఈ ఆక్సలేట్ కేవలం టమోటాల్లోనే కాదు.. కూరగాయల్లో కూడా ఉంటుంది. 100 గ్రాముల టమోటాలో కేవలం 5 గ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. అయితే అతిగా టమోటాలను తిన్నట్లయితే ఆక్సలేట్ స్థాయిలు పెరిగి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి సహకరిస్తుంది. కిడ్నీ రాళ్ల సమస్య, మూత్ర పిండ సమస్యలతో బాధపడేవారికి ఇది మరింత ప్రమాకరం. అందుకే.. మూత్రపిండాల సమస్య, కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు టమోటాలకు దూరంగా ఉండాలి. బీన్స్, బచ్చలికూర, బీట్‌రూట్‌లో కూడా ఆక్సలేట్ ఉంటుంది. వీటిని బాగా ఉడికించి తినాలి. మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య ఉన్నట్లయితే రోజుకు 2 లీటర్ల నీటిని తాగండి.

Related posts