telugu navyamedia
telugu cinema news trending

తెరపైకి అరుంధతి 2 .. ‘పాయల్’ అంచనాలు ఆదుకోగలదా..!

can payal beat anushka in performance

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా ఉన్న అనుష్క, అరుంధతి అంటూ షాక్ ఇచ్చింది. కోడి రామకృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. అనుష్క లీడ్ రోల్ లో వచ్చిన అరుంధతి సినిమా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. 2009లో వచ్చిన అరుంధతి సినిమాకు 10 ఏళ్ల తర్వాత సీక్వల్ రాబోతుంది. అరుంధతి 2 అంటూ ఓ సరికొత్త ప్రాజెల్ట్ కు శ్రీకారం చుట్టారు. కోడి రామకృష్ణ కాలం చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై అంతగా ఫోకస్ చేయలేదు. అయితే శ్రీ శంఖుచక్ర ఫిలంస్ వారు అరుంధతి 2 చేస్తున్నారు. సినిమాలో అనుష్క స్థానంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది.
అనుష్క రేంజ్ వేరు పాయల్ రాజ్ పుత్ క్రేజ్ వేరు.

అరుంధతి చిత్రం నాటికి అనుష్క చాలా సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆరెక్స్ 100 సినిమాతో పాయల్ కూడా భారీ క్రేజ్ మూటకట్టుకుంది. అమ్మడి అందాల ప్రదర్శనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఆమెకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా అరుంధతి 2 జేజెమ్మ అనుష్కని మించి పాయల్ రాజ్ పుత్ చేస్తుందని మాత్రం అసాధ్యం అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తుంది ఎవరన్నది తెలియాల్సి ఉంది. పాయల్ పై ఈ చిత్రంతో అంచనాలు పెరుగుతాయి, మరి ఆ అంచనాలు ఆమె అందుకోగలదా చూడాలి!!

Related posts

రాశిఫలాలు : .. ఆత్మీయుల ఆహ్వానాలు.. ఉద్యోగాలలో అనుకూలత…

vimala p

జెట్ ఎయిర్ వేస్ పై కాజల్ ఆగ్రహం

vimala p

మళ్ళీ అందాలు ఆరబోసిన .. రష్మీ .. శివరంజని ట్రైలర్ కి యువత ఫిదా..

vimala p