telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్ నగర్ : .. ఆఖరి ప్రయత్నంలో నేతలు.. అరెస్టులతో సరి..

BJP candidate huzurnagar

హుజూర్ నగర్ ఉప ఎన్నక ప్రచారం ఈ సాయంత్రంతో ముగియనుంది. పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తం కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో..ఈ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో..ఇక్కడ జరగుతున్న ఉప ఎన్నిక ద్వారా పార్టీ పట్టు..వ్యక్తిగతంగా ఉత్తమ్ రాజకీయ భవిష్యత్ కు ఈ ఎన్నిక కీలకంగా మారింది. అదే సమయంలో అధికారంలో ఉండి ఉప ఎన్నికలో గెలవక పోతే..ఇక రాజకీయంగా మొదలయ్యే సమస్యలు..ప్రచారాల పైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ విడుదల అయిన వెంటనే అభ్యర్దిని రంగంలోకి దించారు. పార్టీ నేతలను గ్రామ గ్రామాన మొహరించారు. బీజేపీ..టీడీపీ అభ్యర్ధులు సైతం బరిలో ఉన్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇక్కడ ఉప ఎన్నిక మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీ ఒక వైపు..ప్రతిపక్షాల వైపు ఒక వైపు అన్నట్టుగా ఈ ఎన్నిక మారింది. దీంతో..ఇది వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు పరీక్షగా మారుతోంది. చివరి రోజు ప్రచారం ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అన్ని పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే పోటీలో రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. కొద్ది గంటల్లో హుజూర్ నగర్ ప్రచారం ముగుస్తుండటంతో కీలక నేతలు అక్కడ ఫోకస్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్ నిర్వహణ కోసం డిపోలు..రోడ్ల మీద ఉన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు నియోజకవర్గంలో గెలుపు కోసం చివరి ప్రయత్నాల్లో బీజీగా ఉన్నారు. దీంతో…కొందరు కీలక నేతలు బంద్ కు దూరంగా ఉంటూ ద్వితీయ శ్రేణి నేతలతో బంద్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శనివారం హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి డాక్టర్‌ రామారావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదే విధంగా పోలింగ్ ప్రారంభం అయ్యే లోగా ఆర్టీసీ విషయంలోనూ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని అక్కడ..వ్యతిరేక ప్రభావం పడకుండా జాగ్రత్త పడే అవకాశాలు లేక పోలేదు.

Related posts