telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

పోలీస్ కోసం .. ఉపవాసం చేస్తున్న ఒంటె.. ! తిండి, నీళ్లు మానేసి..

camel fasting for his mate police

జంతువులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయా.. అంటే వాటిని పెంచుకునే వారికి ఆ రుచి తెలుస్తుంది. వ్యక్తం చేయడానికి వాటికి స్వరపేటిక లేదేమో కానీ, ఏదో ఒక రూపంలో తమ అభిమానాన్ని, ప్రేమని జంతువులు యజమానికి చూపించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలాంటి జాబితాలోకి వచ్చే ఈ ఒంటె ఏమి చేసిందో తెలుసుకుంటే, జంతువులకు అనుబంధాలు.. ఆప్యాయతలు ఉంటాయనేది సుస్పష్టం అవుతుంది. ఆ వివరాలలోకి వెళితే, నిత్యం తన వెంటే ఉండే పోలీసు అధికారి కనిపించక పోవడంతో ఓ ఒంటె ఆవేదన చెందుతోంది. కనీసం ఆహారం, నీళ్లు కూడా ముట్టడం లేదు. పోలీసు అధికారితో ఒంటెకున్న అనుబంధం అలాంటిది మరి. గుజరాత్‌ కుచ్‌ జిల్లా పరిధిలోని జకావు పోలీసు స్టేషన్‌లో శివరాజ్‌ గధ్వి(56) అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శివరాజ్‌ ప్రతి రోజు తనకు కేటాయించిన ఒంటెతో సరిహద్దులో పెట్రోలింగ్‌ నిర్వహించేవారు.

ఈ ఏడాది జనవరి 24వ తేదీన సరిహద్దులోని పింగ్లేశ్వర్‌లో ఒంటెతో పాటు శివరాజ్‌ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో శివరాజ్‌కు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే శివరాజ్‌ పోలీసు స్టేషన్‌కు తిరిగి రాకపోయేసరికి సదరు ఒంటె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. శివరాజ్‌ కనిపించకపోవడంతో.. ఆ ఒంటె ఆహారం, నీళ్లు తీసుకోవడం లేదు. ఒంటెకు ఆహారం, నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related posts