telugu navyamedia
crime culture trending

కూతురి బాయ్ ఫ్రెండ్స్ తో తల్లి శృంగారం… 21 సార్లు

California

కూతూర్ల బాయ్‌ఫ్రెండ్లతో శృంగారంలో పాల్గొన్న లైటిల్ అనే 41 ఏళ్ళ మహిళను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తులరీ కౌంటీ జడ్జి ఆమె కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్షను విధించాలని నిర్ణయించగా, ప్రొబేషన్ రిపోర్ట్ (నిందితురాలికి సంబంధించిన పూర్వ కేసులు, ఇతరత్రా గూర్చి ఇన్‌వెస్టిగేట్ చేసి ఇచ్చే రిపోర్ట్) పరిశీలించిన తర్వాత ఆమెకు విధించిన శిక్ష సరైంది కాదని జడ్జి చెప్పారు. కోర్టు నిర్ణయించిన శిక్షనే ప్రతిసారీ ప్రొబేషన్ రిపోర్ట్ అనుసరిస్తుందని, కానీ ఈ కేసులో ప్రొబేషన్ రిపోర్ట్ శిక్షను ఖరారు చేసే విధంగా ఉందని జడ్జి తెలిపారు. 2017 చివర్లో ఈ కేసు నమోదవ్వగా… అప్పటినుంచి విచారణ కొనసాగుతూ వస్తోంది. కూతుర్ల ఇద్దరు బాయ్‌ఫ్రెండ్లు టీనేజ్ కుర్రాళ్లు కావడంతో వాళ్లకు మాయమాటలు చెప్పి మహిళ లొంగదీసుకున్నట్టు లైటిల్‌పై కేసు నమోదైంది. 21 సార్లు వాళ్లతో శృంగారంలో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరు కుర్రాళ్లను కారులో తులరీ నుంచి విసేలియాకు తీసుకెళ్లి అక్కడ వారికి మందు, సిగిరెట్లు అందించి అనంతరం వారిని శృంగారం చేయాలని బలవంతం చేసినట్టు తెలుస్తోంది. 2017 అక్టోబర్‌లో లైటిల్‌ తనతో మూడు సార్లు శృంగారంలో పాల్గొందని ఓ కుర్రాడు తెలిపాడు. మహిళపై కేసు నమోదు కావడంతో ఆమె భర్త కూడా విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.

Related posts

సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్‌కు ప్రత్యేక రైళ్లు

vimala p

ఎన్నికలలో పోటీకి … 2 కోట్లు, 60 మంది కొత్తవారు.. : పవన్ కళ్యాణ్…

vimala p

ఈరాశి వారు సొమ్మును సురక్షితంగా ఉంచండి

ashok