telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమెరికాను వణికిస్తున్న .. కాలిఫోర్నియా కార్చిర్చు..ఇంకా చల్లారలేదు..

huge fire accident in california forest

కాలిఫోర్నియా కార్చిర్చు.. ఇంకా తగ్గకపోవడంతో అమెరికా వణికిపోతోంది. దీని ధాటికి ఏకంగా లక్షల మందిని అమెరికా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మంటలు అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో సిబ్బందిని మోహరించి ప్రయత్నిస్తోంది. ఇంత చేస్తున్నా.. కాలిఫోర్నియా అడవులను దహిస్తున్న దావానలం శాంతించడం లేదు. కొద్ది రోజుల నుంచి అంటుకుంటున్న కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇది రోజురోజుకు విస్తరిస్తున్నదే గానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కార్చిర్చును ఆర్పేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. హెలీకాప్టర్ల సాయంతో వేగంగా విస్తరిస్తున్న మంటలను అదుపు చేస్తున్నారు.

తాజాగా వెంచురా కౌంటీలో నివసిస్తున్న 7 వేల 500 మంది ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చు కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ఒక్క గురువారమే 12 వేల ఎకరాల అటవీ సంపద బూడిద అయిందట. ఇప్పటి వరకూ దాదాపు 12 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు 700 అగ్నిమాపక యంత్రాలు కృషి చేస్తున్నాయి.

Related posts