telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : … 19న .. రవాణా స్తంబింపచేస్తున్నారుగా..

funds to telangana by central govt

రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీనితో బస్సులు లేక ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె సైరన్ మ్రోగించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన అక్టోబర్ 19వ తేదీ శనివారం నుంచి సమ్మెలోకి వెళుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఆఫీసులకు, ప్రైవేటు జాబ్స్, ఇతరత్రా పనులకు వెళ్లే వారు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా వాహనం ఉన్నా..అధిక ఛార్జీలు చెబుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు… ట్యాక్సీ డ్రైవర్లు కూడా షాక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఉబర్ డ్రైవర్లు 19వ తేదీ శనివారం సమ్మె బాట పట్టబోతున్నారు. పుండు మీద కారం చల్లేలా నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ వాహనాల జేఏసీ. ఈ సందర్భంగా వాళ్లు పలు డిమాండ్స్ వినిపిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా..స్పందించడం లేదని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ, డ్రైవర్ జేఏసీ ఛైర్మన్ షేక్ సలాలుద్దీన్ వెల్లడించారు.

ఐటీ కంపెనీలకు కూడా డిమాండ్ లిస్ట్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 50వేల క్యాబ్‌ సర్వీసులు నిలిచిపోనున్నట్లు అంచనా. దీంతో ప్రజా రవాణా మరింత కష్టంగా మారనుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులపై ఈ ఎఫెక్ట్‌గా ఎక్కువగా పడనుంది. కిలోమీటరుకు కనీసం 22 రూపాయల ఛార్జీగా నిర్ణయించాలని, మెరుగైన జీవన పరిస్థితులు, పని ప్రమాణాలను నిర్ధారించడానికి ఉబర్, ఓలా క్యాబ్‌లు, ఇతర టాక్సీ అగ్రిగేటర్ సేవలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్లందరికీ కనీస వ్యాపార హామీని నిర్ధారించేలా అగ్రిగేటర్ మార్కెట్ ప్రదేశాలకు అనుసంధానించబడిన క్యాబ్‌ల సంఖ్యపై పరిమితి విధించడం వంటి అంశాలను డిమాండ్లలో పొందుపరిచినట్లు యూనియన్ నేతలు తెలిపారు.

Related posts