telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక సినిమా వార్తలు

కేబుల్ ధరపై .. టెలికం నిర్ణయం…

net users increased huge in number

టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కేబుల్‌ చార్జీల పై నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీనితో కేబుల్‌ ఆపరేటర్లు కొంచెం చార్జీలు సవరిస్తూ తుది నిర్ణయం ప్రకటించారు. ఆయా ధరలు ఇలా ఉన్నాయి.

తెలుగు చానళ్ల ధరలు :
ఈటీవీ ఫ్యామిలీ ప్యాక్‌ (7 తెలుగు చానళ్లు) రూ.24, జెమినీ (7 తెలుగు చానళ్లు) రూ.30, స్టార్‌ మా (7తెలుగు, 3 ఇతర భాషా చానళ్లు) రూ.39, జీ తెలుగు (2 తెలుగు, 7 ఇతర భాషా చానళ్లు) రూ.20, మొత్తం రూ.113+రూ.20, 34 జీఎస్టీ ఉంది. ఇక ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ అంటే ఉచితంగా లభించే తెలుగు, ఆంగ్ల న్యూస్‌ ఛానల్స్‌, డీడీ, ఇతర ఉచిత ఛానల్స్‌ ఉన్నాయి. ఇవన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ప్రీమియం ప్యాకేజీ రూ.130లో లభిస్తాయి. దీనికి 18శాతం జీఎస్టీ ఉంటుంది. రూ.130 బేసిక్‌ ప్యాకేజీ ట్యాక్స్‌తో కలిపి రూ.155 అవుతుంది. ఇతర ఛానల్స్‌, బొకేలు కావలసినవి ఎంపిక చేసుకోవచ్చు. అలాకార్ట్‌ (రెండు వేర్వేరు చానల్స్‌ ఒకే ప్యాక్‌) విధానంలో మాటీవీ హెచ్‌డి ఒక్కటే 19 రూపాయలు.

సాధారణమైతే ఎస్‌డి 10 చానల్స్‌ బొకే రూ.39 ధరకు లభిస్తాయి. మొత్తం మీద పేఛానల్స్‌, ప్రీమియం ఛానల్స్‌ కలిపి రూ.285, 300 వరకు నెలవారీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

Related posts