telugu navyamedia
రాజకీయ వార్తలు

పౌరసత్వ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు: అమిత్ షా

amitsha about 370 article in campaign

పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లు గురించి ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వమని, రాజ్యాంగానికి లోబడే పని చేస్తుందని చెప్పారు.

ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టినట్టు కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ ముస్లింలు ఎవరూ తప్పడు ప్రచారంతో ఆందోళనకు గురి కావద్దని కోరారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో ఉన్న మైనార్టీల కోసమే ఈ బిల్లు అని చెప్పారు. ముస్లిం శరణార్థులందరికీ భారత్ ఆశ్రయం కల్పించలేదని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా శరణార్థులకు మన దేశంలో అన్యాయం జరుగుతోందని అమిత్ షా అన్నారు. ఈ బిల్లుతో వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు.

Related posts