telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీ అభిమానులకు నిరాశ… “బుట్ట బొమ్మ” సాంగ్ టీజర్ వాయిదా

frist song from alavaikuntapuramlo movie

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’, ‘ఓ డాడీ’ పాటలు చిత్రంపై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. నేడు బుట్ట బొమ్మ సాంగ్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి, కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల‌న సాంగ్ టీజ‌ర్‌ని నేడు విడుద‌ల చేయ‌లేక‌పోతున్నామ‌ని గీతా ఆర్ట్స్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. త్వ‌ర‌లోనే సాంగ్ రిలీజ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇస్తామ‌ని అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts