telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బుట్టబొమ్మ” ఖాతాలో మరో రికార్డు… ఏమాత్రం తగ్గని క్రేజ్…!!

Butta

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని పాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలోని పాటలు ఆదరణ పొందడం విశేషం. సినిమా విడుదలకు ముందు, విడుదలైన తర్వాత చిత్రంలోని ‘సామజవరగమన’ సాంగ్ సంచలనం సృష్టిస్తే.. సినిమా విడుదల తర్వాత చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడీ సాంగ్ మరో రేర్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన 100 వీడియో సాంగ్స్‌లో 15వ స్థానం సంపాదించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ఈ పాట ఇప్పుడు మరో మైల్‌స్టోన్‌ను అధిగమించింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో 250 మిలియన్స్ వ్యూస్‌ను అధిగమించడమే కాకుండా 2 మిలియన్ లైక్స్‌కు చేరువలో ఉండటం విశేషం. దీంతో స్టైలిష్ స్టార్ హిట్ కొడితే అది సాలిడ్‌గా ఉంటుందని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Related posts