telugu navyamedia
news political trending

రాష్ట్ర బంగారు భవిష్యత్తును … ఏపీసీఎం నాశనం చేస్తున్నారు.. : పారిశ్రామికవేత్త మోహన్ దాస్

businessmen mohan das criticizing apcm

ప్రముఖ పారిశ్రామికవేత్త, అక్షయ పాత్ర సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్ పాయ్ ఏపీసీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ నాశనం చేస్తున్నారంటూ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ ఉగ్రవాదంతో రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల నిలిపివేత, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పునఃసమీక్ష వంటివాటిపై పాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఒప్పందాల పునఃసమీక్షపై జపాన్ ప్రభుత్వం రాసిన లేఖపై ప్రచురితమైన వార్తలను ఆయన తన ట్వీట్‌కు జోడించారు.

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒప్పందాలను తిరగదోడి బెదిరిస్తుంటే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్కరు కూడా ముందుకు రారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో సింగపూర్ భారీగా పెట్టుబడులు పెట్టిందని, కానీ ఆ ఒప్పందాన్ని తిరగదోడడం వల్ల ఇకపై పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. తన ట్వీట్లను ఆయన నేరుగా జగన్‌కే ట్యాగ్ చేయడం విశేషం.

Related posts

ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

vimala p

అలీ తాజా వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి!

vimala p

వివేకా హత్య కేసు : బినామీలే .. కడతేర్చారు.. !

vimala p