telugu navyamedia
crime news

ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్య

బీహార్‌లోని కిద్వాయ్‌పురిలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. నితిన్‌ సరాఫ్‌ అనే వ్యక్తి పాట్నాలో పేరొందిన వ్యాపారాస్థుడు. ఆయనకు చాలా బట్టల షాపులు కూడా ఉన్నాయి. ఈయనకు భార్య ఆక్లా సరాఫ్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సోమవారం రాత్రి నితిన్‌, ఆక్లాతో పాటు వారి కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నితిన్‌ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

vimala p

డేటావార్ దర్యాప్తులో.. కెపీలో ఏపీ పోలీసులకు బ్రేక్!

vimala p

ఒక్కో ఉద్యోగికి.. 62 లక్షల బోనస్ ప్రకటించిన సంస్థ…

vimala p