telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు పై వీడిన మిస్టరీ

New couples attack SR Nagar

హైదరాబాద్ లోని పంజాగుట్టలో ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కేసులో ప్రమేయమున్న ఐదుగురు కీలక నిందితులైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రాము లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసులో 11 మందికి ప్రమేయం ఉందని డీసీపీ వెల్లడించారు. రూ.23 కోట్ల భూ వివాదమే హత్యకు కారణమని తేల్చారు. పక్కా పథకం ప్రకారం రాంప్రసాద్‌ను నిందితులు హతమార్చినట్లు చెప్పారు.

2003లో రాంప్రసాద్ , కోగంటి సత్యం ఇధ్దరూ కలిసి వ్యాపారం చేశారని చెప్పారు. వ్యాపారలావాదేవీల్లో భాగంగా కోగంటికి రూ.70 కోట్లను రాంప్రసాద్ బకాయిపడ్డాడని అన్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వివాదం తలెత్తడంతో, పెద్దమనుషుల వద్దకు వెళితే, కోగంటికి రూ.23 కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్ చేశారని అన్నారు. అయినప్పటికీ, సెటిల్ చేసిన బకాయిని రాంప్రసాద్ చెల్లించలేదని, దీంతో, రాంప్రసాద్ పై కోగంటి ఆగ్రహంతో ఉన్నాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాంప్రసాద్ ను హత్య చేయించాలనే నిర్ణయానికి వచ్చాడని తెలిపారు.

Related posts