telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

లోయలో పడ్డ మరో.. బస్సు.. 35మృతి.. రోజుల బిడ్డతోసహా.. అత్యాశే… కారణం..

bus accident in J & k 35 died

బస్సు యజమానుల అత్యాశ అమాయక ప్రయాణికుల ప్రాణాలు తీస్తుంది. ఒకపక్క ప్రభుత్వ బస్సులు తక్కువగా ఉండటం, మరోపక్క ప్రైవేట్ దందా.. కలిసి ఈ ఘోరాలకు దారితీస్తున్నాయి. ప్రైవేట్ వారితో లాలూచి పడి ప్రభుత్వం కావాలనే కొన్ని రూట్లలో తక్కువ బస్సులు నడుపుతుంది.. అందుకే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి బస్సు ప్రమాదాలకు ఆలవాలం గా కొన్ని రూట్లు తయారయ్యాయి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రభుత్వం తీరులో మార్పు రావటంలేదంటే .. ప్రైవేట్ వారిదగ్గర యెంత దండుకుంటున్నారో .. ఆలోచించవచ్చని బాధితుల కుటుంబాలు వాపోతున్నాయి. తాజగా, మరో బస్సు లోయలో పడటంతో 35 మంది మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది మహిళలతోపాటు 45 రోజుల పసి బిడ్డ కూడా ఉండటం విచారకరం.

కేశ్వాన్ నుంచి కిష్టావర్ వెళ్తున్న మినీ బస్సు సిర్గారి మలుపులో అదుపు తప్పి పక్కనే 500 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. బస్సులో 52 మంది ఉండగా 35 మంది అక్కడికక్కడే చనిపోయారని డీఎస్పీ శక్తి పాఠక్ చెప్పారు. కొందరు క్షతగాత్రులను ఐఏఎఫ్‌కు చెంది న 2 ఎంఐ-17 హెలికాప్టర్లు, పవన్ హ న్స్ హెలికాప్టర్ ద్వారా దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ఒక బైక్ పై ముగ్గురు ఎక్కి ప్రయాణిస్తుంటే చలానా రాసేవారికి, బస్సులలో సామర్ధ్యానికి మించి ఎక్కించుకునే వారిని ఏమీ చేయక మిన్నకుండటం వెనుక ఇదో దందా.. అని ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంది, ఈ పరిస్థితులు ఎన్నడు మారినో, అప్పుడే ఈ ప్రమాదాలకు చరమగీతం!!

Related posts