telugu navyamedia
సినిమా వార్తలు

“బుర్రకథ” విడుదల వాయిదా

Burrakatha

దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై డైమండ్ ర‌త్న‌బాబు దర్శకత్వంలో యంగ్ ఆది హీరోగా న‌టించిన తాజా చిత్రం “బుర్ర‌క‌థ‌”. ఎన్నో సినిమాలకు కథలు అందించిన డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రంలో ఆది సరసన హీరోయిన్ గా మిస్తీ చక్రవర్తి నటించారు. నైరా షా మరో హీరోయిన్ గా కన్పిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, పోసాని, పృథ్వీ, ప్రభాస్ శ్రీను, గాయత్రి గుప్తా, ఫిష్ వెంకట్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఏ చిత్రానికి హెచ్.కే. శ్రీకాంత్ దీపాల, కిషోర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను విక్ట‌రీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను శుక్రవారం విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెన్సార్ సర్టిఫికేషన్ లో ఇబ్బందులు ఎదురవ్వడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈరోజు కూడా సెన్సార్ పూర్తయ్యే ఛాన్స్ లేకపోవడంతో శనివారం నాటికి సినిమాను వాయిదా వేశారు. అనుకున్న దానికంటే ఒకరోజు ఆలస్యంగా జూన్ 29న విడుదల చేయనున్నారు. చాలారోజుల గ్యాప్ తరువాత “బుర్రకథ” వంటి డిఫరెంట్ సినిమాతో వస్తున్న ఆది ఈ సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు. మరి ఈ సినిమా ఆదికి ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.

Related posts