telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం …?

allu arjun in mass cast again with sukumar

 ‘అల వైకుంఠపురములో’తో ఏకంగా కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకుని, ఇప్పుడు ఇదే ఊపులో తన నెక్స్ట్ వెంచర్ కోసం రెట్టించిన ఉత్సాహంతో నటిస్తున్నాడు బన్నీ. అంతేకాదు… తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. ఒక పాత్ర కోసం గుబురు గడ్డం, ఉంగరాల జట్టుతో మాస్ అప్పీల్ ఇవ్వనున్న బన్నీ… మరో పాత్ర కోసం మోడ్రన్ లుక్ లో క్లాస్ టచ్ ఇస్తాడట. మొత్తమ్మీద కెరీర్ లో తొలిసారి డ్యూయెల్ రోల్ చేస్తుండడంతో… బన్నీ ఈ సినిమాపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడని సమాచారం. 

‘ఆర్య’, ‘ఆర్య 2’ తరువాత బన్నీ, సుక్కు కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ‘అల్లు అర్జున్ 20’పై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు, ఈ సినిమా క్రూసియల్ కాస్ట్ అండ్ క్రూ అంతా బ్లాక్ బస్టర్స్ తో జోష్ లో ఉండడం కమర్షియల్ గా మరింత ప్లస్ అయ్యే అంశమనే చెప్పాలి. ‘అల వైకుంఠపురములో’తో బన్నీ ‘నాన్ – బాహుబలి’ ఇండస్ట్రీ హిట్ చూస్తే… ప్రీవియస్ మూవీ ‘రంగస్థలం’తో సుక్కు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ ఘనవిజయాలతో చిత్ర నాయిక రశ్మిక మంచి జోరులో ఉంది. అలాగే పనితీరు విషయంలో విమర్శల పాలవుతున్నా… ‘ఎఫ్ 2’, ‘చిత్రలహరి’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ రూపంలో వరుస విజయాలు చూస్తున్నాడు స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్. 

Related posts