టీమిండియా సంచలన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ పై టీమిండియా మాజీ క్యాప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా తరహా బౌలింగ్ యాక్షన్ తో గాయపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. బుమ్రా బౌలింగ్ శైలి గమనిస్తే, అతని చేతి కంటే శరీరమే ఎక్కువ శ్రమకు గురవుతుందని, అదే అతడి గాయానికి మూలకారణమని తాను భావిస్తున్నట్టు తెలిపారు.
ఇలాంటి కష్టసాధ్యమైన యాక్షన్ తో దీర్ఘకాలంలో బుమ్రా మరింతగా గాయపడే అవకాశాలున్నాయని అన్నారు.ఇటీవల కాలంలో అనేకజట్లను బుమ్రా తన బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే, వెస్టిండీస్ పర్యటన అనంతరం గాయపడిన బుమ్రా అనేక సిరీస్ లకు దూరమయ్యాడు. ప్రస్తుతం వెన్నుపూస గాయం నుంచి కోలుకుని ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తున్నాడు.
మతాలను వాడుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య: రఘువీరా