telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ : .. విరుచుకుపడుతున్న .. బుమ్రా ..

bumra fire on westindies batsmen

రెండో టెస్ట్‌లోను భార‌త్ ప‌ట్టు బిగించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 416 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. తొలి టెస్ట్‌లో సెంచ‌రీ మిస్ చేసుకున్న తెలుగు తేజం హ‌నుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్‌లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భార‌త్ భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. అంత‌క ముందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ (76; 10 ఫోర్లు) అర్ధశతకంతో మెరిశాడు. ఇక చివ‌రిలో ఎనిమిదో వికెట్‌కు ఇషాంత్ శర్మ (57) , హ‌నుమ‌తో కలిసి అజేయంగా 102 పరుగులు జోడించడం విశేషం.

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్‌ని బుమ్రా ఏ ద‌శ‌లోను కోలుకోనివ్వ‌కుండా చేశాడు. వ‌రుస వికెట్స్ తీస్తూ విండీస్ ప‌త‌నాన్ని శాసించాడు. మొత్తంగా ఆరు వికెట్లు తీసిన బుమ్రా .. ఇందులో హ్యాట్రిక్ కూడా న‌మోదు చేసుకున్నాడు. విండీస్ బ్యాట్స్‌మెన్స్‌లో క్రైగ్ బ్రాత్‌వైట్ (10), కెంప్‌బాల్ (2), డారెన్ బ్రావో (4), బ్రూక్స్ (0), రోస్టన్‌ఛేజ్ (0), జేసన్ హోల్డ్ (18) త‌క్కువ ర‌న్స్‌కే వెనుదిర‌గ‌గా.. సిమ్రాన్ హెట్‌మెయర్ (34) కాస్త ప‌ర్వాలేద‌నిపించాడు. ఆయ‌న వికెట్ షమీకి ద‌క్కింది . ప్రస్తుతం క్రీజులో హామిల్టన్ (2 నాటౌట్), రకీమ్ కార్న్‌వాల్ (4 నాటౌట్) ఉండగా.. భారత్ కంటే ఇంకా 329 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ వెనకబడి ఉంది. ఈ రోజు విండీస్ ఫాలో ఆన్ ఆడే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ ఐదు వికెట్లు, రకీమ్ కార్న్‌వాల్ మూడు వికెట్లు పడగొట్టారు.

Related posts